ముంబై: భారత స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస లాభాలకు తెరపడింది. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి, బీఎ్‌సఈ సెన్సెక్స్ 541.81 పాయింట్ల (0.90 శాతం) నష్టంతో 59,806.28 వద్దకు జారుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 164.80 పాయింట్లు (0.93 శాతం) కోల్పోయి 17,589.60 వద్ద క్లోజైంది. అంతర్జాతీయ మార్కెట్ల నిరాశాజనక సంకేతాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ తదితర షేర్లలో మదుపర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 23 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 3.31 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. కాగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 7 పైసలు బలహీనపడి రూ.82.02 వద్ద ముగిసింది.