Thursday, September 12, 2024
spot_img
HomeINTERNATIONALనేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌

నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌

ఖాట్మండు, మార్చి 9: నేపాల్‌ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 78 ఏళ్ల రామ్‌చంద్ర పౌడెల్‌ నియమితులయ్యారు. నేపాల్‌ అధ్యక్షుడిని ఆ దేశ ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నుకుంటుంది. అందులో ఆ దేశ పార్లమెంట్‌ (332), ఏడు ప్రావిన్స్‌లకు చెందిన అసెంబ్లీ (550) సభ్యులు ఉంటారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రామ్‌చంద్ర పౌడెల్‌కు 33,712 (64.13%) ఎలక్టోరల్‌ ఓట్లు దక్కగా, ఆయన ప్రధాన ప్రత్యర్థి సీపీఎన్‌- యూఎమ్‌ఎల్‌ పార్టీకి చెందిన సుభాష్‌ చంద్ర నెమ్‌వాంగ్‌కు 18,518 (35.23%) ఓట్లు దక్కాయి. పౌడెల్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై నేపాలీ కాంగ్రెస్‌ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నేపాల్‌ అధ్యక్షురాలిగా ఉన్న బిద్యాదేవీ భండారీ పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు పౌడెల్‌ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఏ అభ్యర్థి అయినా రెండుసార్లకు మించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదనే నిబంధన ఆ దేశంలో అమల్లో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments