జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందుతున్న లక్ష్మారెడ్డి సేవలు మరువ లేనివని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి అన్నారు. ఈనెల 31వ తేదీన పదవి విరమణ పొందుతున్న లక్ష్మారెడ్డి ముందస్తు గా సెలవు పై వెళ్తుండడంతో ఆయనకు శుక్రవారం పోలీస్ స్టేషన్లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ వరగంటి రవి, మాట్లాడుతూ, ఏఎస్ఐ లక్ష్మారెడ్డి బాధ్యతగా తన విధులు నిర్వహిస్తూ అటు అధికారుల నుండి ఇటు ప్రజల నుండి మంచి పేరు తెచ్చుకున్నారని మచ్చలేని అధికారిగా గుర్తింపు తెచ్చుకొని పదవి విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ఇన్స్పెక్టర్ వరగంటి రవి అన్నారు. లక్ష్మారెడ్డి తన శేష జీవితాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడపాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుళ్లు సదయ్య, మోహన్, ప్రవళిక, యాకూబ్, హోమ్ గార్డ్స్ అశోక్, రమేష్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.