కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల/ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని DYFI, KVPS ఆధ్యర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల RCO స్వరూప రాణికి వినతి పత్రం అందించిన DYFI జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తిక్. KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్. ముఖ్యంగా రెబ్బెన మండలంలో గల గురుకుల బాలికల పాఠశాల/కళాశాల బీసీ బాలుర హాస్టల్ లో కొనసాగుతుంది, దీని వలన అక్కడ విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇరుకు గదులలో విద్యను అభ్యసిస్తున్నారని ఒక డార్మెటరీలో సుమారు, 80 మంది విద్యార్థులు ఇరుక్కుని నిద్రపోవలిసి వస్తుందని, దీని వలన విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నారన్నారు. అక్కడి ప్రిన్సిపల్ విద్యార్థులను పట్టించుకోవడం లేదని మెనూ ప్రకారం భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థుల తల్లి తండ్రులు సెలవులలో వారి పిల్లలను కలవడానికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లి తండ్రులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని, సిర్పూర్ టీ బాలుర పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని వెంటనే అక్కడ నూతన గురుకుల భవనాన్ని మంజూరు చేయాలని, ఆసిఫాబాద్ ప్రిన్సిపల్ స్థానికంగా ఉండకుండా రాకపోకలు కొనసాగిస్తు విద్యార్థులను పట్టించుకోవడం లేదని పాఠశాల పరిశుభ్రంగా ఉండటం లేదని స్థానికంగా నివాసం ఉండని ప్రిన్సిపాల్ల పై చర్యలు తీసుకోవాలని కోరారు .