జమ్మికుంట జడ్పిటిసి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బూడిద పంచాయితీ ముందు పెట్టుకొని పబ్బం గడుపుతున్నాడని గత ఎన్నికల సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిస్తే 1000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చాడని గుర్తు చేశారు. హామీలన్నీ గాలికి వదిలేసి కేవలం తెలంగాణ భవన్ ఖాళీగా ఉందని అక్కడ ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప హుజురాబాద్ కు చేసేది ఏం లేదని హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు 10 లక్షల రూపాయలకు కింద కొంతమంది లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఎన్నిసార్లు దళిత బంధు లబ్ధిదారులు అధికారులకు, నాయకులకు విన్నవించుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని వారు గుర్తు చేశారు. గత ప్రభుత్వం, హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ డబుల్ బెడ్ రూమ్ పథకం కింద హుజురాబాద్ పట్టణంలో జమ్మికుంట పట్టణంలో కమలాపూర్, డబల్ బెడ్ రూమ్ నిర్మాణం చేశారని వాటిని ఇంతవరకు కూడా నిరుపేద కుటుంబాలకు కేటాయించకుండా చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో అప్పటి ఎమ్మెల్సీ ఇప్పుడున్న హుజురాబాద్ ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాదారులకు ఇండ్ల స్థలం కేటాయించినప్పటికీ కూడా లబ్ధిదారులకు చేరలేదని వారు గుర్తు చేశారు.
ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ లో కిక్కు లేదని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చిన కౌశిక్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్ లకే పరిమితమయ్యారని గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడంలో తప్ప గతంలో చేసింది ఏమీ లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా జెడ్పిటిసి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కేవలం బూడిద పంచాయతీ ముందేసుకుని పబ్బం గడుపుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ ప్రజా సమస్యలను పట్టించుకోవాలని కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు రెండో విడత పథకం విడుదల చేయించాలని వారిని సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పైన స్పందించాలి తప్ప వ్యక్తిగత ఆరోపణ చేసుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవాలని ఈ నియోజకవర్గంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లు పేదలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజలు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు..