Thursday, September 12, 2024
spot_img
HomeTELANGANAఉద్యోగ భద్రత కల్పించని BRS ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి - దాసరి ఉష

ఉద్యోగ భద్రత కల్పించని BRS ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి – దాసరి ఉష

నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్దపల్లి పట్టణం అమరవీరుల స్తూపం వద్ద చేస్తున్న సమ్మె కార్యక్రమానికి తన సంఘీభావాన్ని తెలిపిన బీఎస్పి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష అనంతరం ఆమె మాట్లాడుతూ గత 6 రోజుల నుండి NHM కాంట్రాక్టు ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి దోపిడి పాలన చేస్తున్నారని విమర్శించారు. NHM లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, సెకండ్ ANM లకు ఉద్యోగ భద్రత లేక కరోనా సమయంలో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తున్న వీరికి కనీస ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, హెల్త్ కార్డులు కూడా లేవని ప్రజల ఆరోగ్యం చూసుకునే వారికి కనీస ఆరోగ్య భద్రత ఇవ్వని ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ఆలోచన చేయాలన్నారు. గత 23 సంవత్సరాల నుండి NHM లో పబ్లిక్ హెల్త్ మేనేజర్ గా పనిచేస్తున్న వారు 13 వేల రూపాయల వేతనంతో చాలీచాలని జీవితాలను కొనసాగిస్తున్నారని వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే గత దింపి బహుజన రాజ్యంలోనే మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామన్నారు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామిల్ల శారద, పట్టణ ఉపాధ్యక్షులు మాచర్ల బబ్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం డి అజీమ్, బివిఎఫ్ టీం చిన్ను, హనీ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments