గురువారం నాడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పోన్నం ప్రభాకర్, మన రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం తో కలిసి రైతులకు రుణమాఫీ ప్రారంభించారు. ప్రతి మండలానికి రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పరని తెలంగాణ రాష్ట్రం కోసం మాటిచ్చారు మాట నిలుపుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది మాట నిలుపుకుందని రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తనుగుల రైతు వేదిక వద్ద కేక్ కట్ చేసి, స్వీట్ పంపిణీ చేసి, టపాసులు కాల్చి, రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకి పొన్నం ప్రభాకర్కి ప్రణవ్ బాబు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ అధికారులు కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి, వెంకట్ రెడ్డి, రామస్వామి, పరశురాం, సుంకరి రమేష్, పుల్లూరి సదానందం, పర్లపెల్లి నాగరాజ్, రజనీకాంత్, పూసాల శ్రీనివాస్, జక్కే సమ్మయ్య, జక్కే అశోక్, రవి, పైడిపల్లి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు …