హైటెక్ సిటీ నోవాటెల్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్సవాలలో జమ్మికుంట మున్సిపాలిటీ నుండి మెప్మా ఆర్పీ, చేయూత ఫౌండేషన్ ఎన్.జి. ఓ ఆబెదా బాను ఉమెన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగల్ ఉమెన్ గా ఉండి మహిళ సంఘాల స్త్రినిధి, బ్యాంకు లింకేజ్ సహకారంతో వ్యాపారం ప్రారంభించి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ, చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ, అన్నదానం, మరియు కోవిడ్ లో క్వారంటైన్ లో ఉన్నవారికి అన్నదానం, కూరగాయల పంపిణీ పేదవాళ్లకు కావలసిన దుప్పట్లు, ఆహార పదార్థాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తింపుగా మహిళ దినోత్సవం రోజూ రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తమ సంస్థ కార్యదర్శి ఆబేదాబాను అవార్డ్ అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.