గత ప్రభుత్వంలో గజిటెడ్ ఉద్యోగుల సంఘంలో పనిచేసిన ఏ నాయకున్ని కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఎన్నుకోకూడదు అలాంటి వ్యక్తులు మళ్లీ వచ్చినట్టయితే గజిటెడ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు కనుక ఇప్పటికైనా గెజిటెడ్ ఉద్యోగులు కళ్ళు తెరిచి నీతి నిజాయితీతో గెజిటెడ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు పని చేసే నాయకులకు ఎన్నుకోండి మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గజిటెడ్ ఉద్యోగులకు శనివారం రోజు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ గజిటెడ్ ఉద్యోగుల ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఆ ప్రభుత్వానికి పొత్తులుగా పనిచేస్తూ శాలువాలు పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటూ ఆ నాయకుల చుట్టూ తిరిగిన గజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు వారి కొరకు వారి కుటుంబ సభ్యులకు గజిటెడ్ ఉద్యోగుల సంఘాన్ని వాడుకున్న అలాంటి నాయకులను మళ్ళీ జరగబోయే తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ ఎన్నికలలో ప్రాముఖ్యత ఇవ్వకండంటూ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గజిటెడ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. గజిటెడ్ ఉద్యోగుల ప్రమోషన్ల గురించి వారి యొక్క ట్రాన్స్ఫర్ ల గురించి ఎల్లప్పుడూ సమస్యలు పరిష్కరించే నాయకులను, జరగబోయే గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలలో నీతి నిజాయితీతో పని చేస్తూ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసే అలాంటి గజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులను జరగబోయే ఎన్నికలలో ఎన్నుకుంటే అలాంటప్పుడే ఆ గెజిటెడ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది అని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
గతంలో గజిటెడ్ ఉద్యోగుల సంఘ నాయకులు ఏ ఒక్కరోజు సమావేశం ఏర్పాటు చేసిన పాపాన లేదని ఏ శాఖకు సంబంధించిన గెజిటెడ్ ఉద్యోగులు వారి సమస్యలగురించి అప్పటి నాయకులను కలిసిన కూడా ఆ నాయకులు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకొని వెళ్లక పోవడంతో ఆ సమస్యలు అలాగే పెండింగ్లో పడి ఉన్నాయని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. అందుకే తొత్తులుగా పనిచేసే నాయకులను జరగబోయే ఎన్నికలలో ప్రాముఖ్యత కల్పించకండి అలాంటి నాయకులను తరిమి కొట్టండి, ఇప్పటికైనా గజిటెడ్ ఉద్యోగులు కళ్ళు తెరిచి నీతి నిజాయితీతో పనిచేయడానికి ముందుకు వస్తున్న గజిటెడ్ ఉద్యోగుల సంఘ నాయకులను మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అలాంటి వ్యక్తులను సంఘ నాయకులుగా ఎన్నుకోవాలని గజిటెడ్ ఉద్యోగులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. సంఘ నాయకులుగా చలామణి అవుతూ వారి కుటుంబ సభ్యులు పదవి విరమణ పొందిన కూడా మళ్లీ వారిని ప్రభుత్వ శాఖలో చేర్పించుకోవడానికి ప్రయత్నం చేసిన అలాంటి నాయకులను ఈసారి జరగబోయే గజిటెడ్ ఉద్యోగుల సంఘ ఎన్నికలలో ఎన్నుకోకూడదని అలాంటి నాయకులను మళ్లీ గజిటెడ్ ఉద్యోగుల సంఘం వైపు కూడా రానివ్వకుండా అలాంటి వ్యక్తుల మాటలను కూడా నమ్మవద్దని ఇప్పటికే గజిటెడ్ ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగింది కనుక ఇకముందు అలాంటి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా నూతనముగా ఎన్నికయ్యే గజిటెడ్ అధికారుల సంఘం పనిచేయాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కొరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యోగుల కుటుంబ సంక్షేమం కొరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడటం చాలా సంతోషం అని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతనముగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు వారి కుటుంబాల సంక్షేమం కొరకు గెజిటెడ్ ఉద్యోగుల ప్రమోషన్ల కొరకు ప్రతి ఒక్క సమస్య పరిష్కరించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వానికి మన తెలంగాణ ముద్దుబిడ్డ డైనమిక్ టైగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ప్రతి ఒక్కరూ గజిటెడ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు అందుబాటులో ఉంటారని అందుకే ఈ ప్రభుత్వం నిరుపేద ప్రజల కొరకు మంజూరు చేసే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అన్ని గ్రామీణ ప్రాంతాలలో చేరేటట్టు కృషి చేయవలసిన బాధ్యత కూడా ప్రతి గజిటెడ్ అధికారిపై ఉందని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా గజిటెడ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు