ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 87వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. శనివారం బస్టాండు సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా పనిచేశారని ఆయన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహిస్తుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్, సీనియర్ నాయకులు దత్తాత్రేగౌడ్, కర్కే శ్రీనివాస్, గోగురి శ్రీనివాస్ రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, నర భగవంతు రెడ్డి, పాశం నాగిరెడ్డి, అందె ఎల్లయ్య, పందిర్ల సుధాకర్ గౌడ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫిక్, లాగల చంద్రారెడ్డి, బండి పరశురాములు తదితరులు పాల్గొన్నారు


