రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా గత కొంతకాలంగా ఆపిన ప్రజావాణి కార్యక్రమం గత శుక్రవారం పునః ప్రారంభమైన సంగతి విదితమే ప్రతివారం మంగళ, శుక్రవారాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి పరిష్కారం పొందడానికి ఇది ఒక చక్కటి వేదికగా మారింది. ముస్లింలలో అతి వెనకబడ్డ సామాజికంగా ఆర్థికంగా ఉపాధి లేక ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలలో 14 తెగలను వారి అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా బీసి ఈ కేటగిరీలో చేర్చి 4% రిజర్వేషన్లు అమలు పరుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ బీసీ ఈ లో ఉన్న 14 తెగలవారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలకు కావలసిన ప్రాధమిక ప్రమాణ పత్రం వారి కులధ్రువీకరణ పత్రం. ఈ కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న 14 తెగల పేద ముస్లింలు నానా అవస్థలు పడుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. సంబంధిత మండల తహసీల్దారులు అసలు మీ కులం ఎక్కడ ఉందని అడుగుతూ కనీసం అప్లికేషన్ కూడా తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం ఆధ్వరంలో సంఘ సభ్యులు నేడు రాజధాని చేరుకొని ప్రజావాణిలో తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ ప్రాధమిక హక్కైనా కులధ్రువీకరణ పత్రం మంజూరుచేసేలా సంబంధిత తహసీల్దారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్, రాష్ట్ర కోశాధికారి యాకూబ్, భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు సైదుల్ పాషా, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ అలీ, సంఘ సభ్యులు మౌలానా, సలీం, మదర్ భాష తదితరులు పాల్గొన్నారు