సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ పరిధిలోని ఎరుకల బస్తీ, లక్ష్మయ్య దోడి బస్తీలలో అధికారులతో కలిసి పర్యటించారు. విద్యుత్, త్రాగు నీరు, రోడ్ల సమస్యను బస్తీవాసులు, మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చినప్పటికీ ఎవరు సమస్యను మాత్రం తీర్చలేదాని మహిళలు వాపోయారు. ఈ కార్యక్రమంలో డి.ఈలు ధర్మారెడ్డి, ఆంజనేయులు, డి.సీ సమ్మయ్య, వాటర్ వర్క్స్ డీ.జి.ఎం సాగర్, ఏ.ఈ హకిం తదితరులు పాల్గొన్నారు.