అవినీతి ఆరోపణల కేసులో సుమారు ఏడాదికి పైగా జైల్లో ఉన్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అనిల్ దేశ్‌ముఖ్(73) బెయిల్‌పై విడుదలయ్యారు. ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలు నుంచి బుధవారం సాయంత్రం 4.45 గంటలకు విడుదలైన ఆయన్ను అజిత్ పవార్, జయంత్ పాటిల్, సుప్రియ సూలే తదితర పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా.. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, తనను తప్పుడు కేసులో ఇరికించారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించిందని అనిల్ పేర్కొన్నారు.