అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో 19 వ తేదీ సాయంత్రం నేషనల్ అవార్డ్ సెలబ్రేషన్ 2024 అందజేశారు. సౌత్ రీజియన్ రాష్ట్రాల నుండి దాదాపు 30 మంది సభ్యులకు వివిధ రంగాల నుండి ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ వేదిక పై చేయూత్ ఫౌండేషన్ ఎన్.జి. ఓ సభ్యులకు ఎన్.జి. ఓ వ్యవస్థాపకుడు *దూడపాక శ్రీనివాస్ కు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా పురస్కార్ అవార్డు. మరియు సభ్యులు. అభేద బాను, శిరీషలకు రాణి రుద్రమదేవి సేవా పురస్కార్ జాతీయస్థాయి అవార్డులు *మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్ చెరిపెల్లి* చేతుల మీదుగా అందుకున్నారు. రానున్న రోజుల్లో మరింతగా సమాజానికి సేవలు చేయాలని వారు కోరుతూ షీల్డ్, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అయిన రష్మి థాకూర్. మిస్ ఏసియా ఇంటర్నేషనల్ మిస్ ది ప్లానెట్, దాసరి పార్వతి సరిగమ సింగర్ జీ తెలుగు ఫేమ్, కల్పన పొన్నం యూ ట్యూభర్, రాజుగాడు మూవీ డైరెక్టర్ సంజనా రెడ్డి, ఏ పి ఉమెన్ కమిషన్ మెంబర్ రుకియా, గతంలో కరోనా కాలంలో వారు చేసిన ఉచిత మాస్కుల పంపిణీ, ఉచిత అన్నదానం, నిరు పేదలకు పండ్లు, నిత్యావసరాల పంపిణీ, కరోనా రోగులకు ఉచిత మందుల పంపిణీ, కానిస్టేబుల్ మహిళా అభ్యర్థినులకు ఉచిత అల్పాహారం, టీ షర్ట్స్, స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ, మహిళ ఉపాధి కల్పనకు ఉచిత కుట్టు శిక్షణ, మొదలగు కార్యక్రమాలు స్వచ్చందంగా నిర్వహించినందుకు గాను అవార్డు పొందినందుకు జమ్మికుంట స్వచ్ఛంద సంస్థ సభ్యులకు జాతీయ స్థాయి అవార్డ్ రావడం పట్ల వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.