జయశంకర్ భూపాలపల్లి జిల్లా గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్ గా జంగేడు మాజీ సర్పంచ్ బుర్ర కొమురయ్య గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా బత్తిని శ్రీహరి గౌడ్, ఓరుగంటి శంకర్ గౌడ్ (న్యాయవాది) మోడెo ఉమేష్ గౌడ్, కారేoగుల తిరుపతి గౌడ్ (దన్నవాడ మాజీ సర్పంచ్) మాటూరి రవీందర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రధాన కార్యదర్శులుగా కత్తి సంపత్ గౌడ్, ముత్యాల శ్యామ్ గౌడ్, మూల శంకర్ గౌడ్, బండి తిరుపతి గౌడ్ కార్యదర్శిగా, మాచర్ల వంశీకృష్ణ గౌడ్ సెక్రెటరీగా చర్లపల్లి వెంకటేశ్వర గౌడ్ సహాయ కార్యదర్శిగా, బొమ్మ రమేష్ గౌడ్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా, ముఖ్య సలహాదారులుగా సీనియర్ జర్నలిస్టు పర్కాల సమ్మయ్య గౌడ్, బుర్ర చంద్రయ్య గౌడ్, గూనిగంటి మహేందర్ గౌడ్, మోట పలుకుల శివశంకర్ గౌడ్, మారగొని శ్రీనివాస్ గౌడ్, మారగోని కుమార్ స్వామి గౌడ్, వడ్లకొండ నారాయణ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా గట్టు శివశంకర్ గౌడ్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి చింత రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పులి మోహన్ గౌడ్ లు హాజరై ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల నుండి వచ్చిన గౌడ బాంధవులకు నా ఎన్నికు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా మరొక సమావేశం ఏర్పాటు చేయనున్నామని, అన్ని మండలాల కమిటీలు కూడా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్, చింత రమేష్ గౌడ్, పులి మోహన్ గౌడ్, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ కోట రాజబాబు గౌడ్, రేగొండ మాజీ ఎంపీపీ మండల తిరుపతి గౌడ్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.