జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో తేదీ 01 – 6- 2024 శనివారం హనుమాన్ పెద్ద జయంతి”ఉత్సవాలు ఆలయ అర్చకులు శ్రీ శేషం వరప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి మరియు శ్రీ భక్తాంజనేయ స్వామి లకు పంచామృత అభిషేకం, నాగవళ్లి దళం (తమలపాకుల) పూజ మరియు విశేష అలంకరణ తదుపరి ప్రధాన హారతి తీర్థ ప్రసాదాలు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు అందజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దుల రవీందర్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రామమూర్తి దంపతులు స్వామి వార్లకు పట్టు వస్త్రాలను అందజేయడం జరిగింది. జయంతి ఉత్సవాలకు హాజరైన వందలాదిమంది భక్తులకు దాస్యపువెంకట్రామ నరసయ్య దంపతులు, గర్రెపల్లి లక్ష్మీనారాయణ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ జూగురుసదానందం, కొత్తపల్లి మాజీ ఉపసర్పంచ్ కొక్కుల శశిధర్, హనుమాన్ దీక్ష పరులు కూరపాటి సాయి కృష్ణ, జితేందర్, ఉపేందర్, ప్రశాంత్, సతీష్ చిరంజీవి. తదితరులు పాల్గొన్నారు.