కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమాను జాతర జరుగనుంది. దాంతో పాటు విజయనగరం ఉత్సవాలు కూడ. ఈ క్రమంలో భక్తుల రద్దీ, ఉత్సవాలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం ప్రత్యేకంగా విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలతతో నగరంలో సిరిమాను తిరిగే ప్రదేశాలను పరిశీలించారు. సిరిమాను ఉత్సవానికి ఉన్న సిబ్బందితో పాటు అదనంగా 2వేల సిబ్బందిని నియమిస్తున్నట్టు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జెట్టి తెలిపారు.
శ్రీ పైడితల్లి జాతరకు దాదాపు 2వేల మందీ అదనపు సిబ్బందితో బందోబస్తు.
RELATED ARTICLES


