కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చంద్రబాబు రోడ్‌షో, సభలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. చంద్రబాబు రోడ్‌షో, సభలకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై స్థానిక టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా.. సభలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు సభను టీడీపీ నేతలు జరిపి తీరుతామంటున్నారు. టీడీపీ శ్రేణులను అడ్డుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
కుప్పంలో పర్యటనపై హైటెన్షన్
RELATED ARTICLES