మెరిడియన్ హైస్కూల్ బ్రాంచ్ 2 ఆద్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. ఈ వేడుకలో డైరెక్టర్లు దేవెందర్ రెడ్డి, రాజవెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజవెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలంటే గురువు మెదటి మెట్టు అని గురువును పూజిస్తే గురువును గౌరవిస్తే సంఘంలో సమాజంలో కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారని ఉన్నతవంతమైన జీవితాన్ని పొందుతారని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలు గ్లోబల్ లీడర్ గా పారిశ్రామికవేత్తలుగా, సినీ యాక్టర్ గా, డాక్టర్ గా, ఇంజనీర్ గా తరగతి గదిలోనే వారి జీవితాన్ని మలుచుకుంటారని పేర్కొన్నారు.