ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో విజయనగరంలో భారీగా చేరికలు జరిగాయి. అధికార వైఎస్సార్పీపీ లోకి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో దాదాపు వందమందికి పైగా చేరారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఇది కాదా సీఎం జగన్ జన రంజకమైన పాలన అని అన్నారు. కావాలనే తాము పార్టీలోకి చేరుకోవటం లేదన్నారు సీఎం జగన్ ఈ అయిదేళ్ల కాలంలో చేసిన అభివృధ్ధి అందించిన సంక్షేమాన్నిచూసే ప్రజలు పార్టీలోకి చేరుతున్నారని విజయనగరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు