జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో నిర్వహించే వార్డు సభలను విజయవంతం చేయాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే వార్డు సభకు ప్రజలు హాజరై ఇందిరమ్మ ఇండ్లు కొత్తగా నమోదు, కొత్త రేషన్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ తెలిపారు. కింద తెలిపిన విధంగా వార్డుల వారీగా సభ నిర్వహిస్తున్నట్లు మహమ్మద్ అయాజ్ తెలిపారు..

