గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, కర్బన పదార్థాలను నిల్వచేసి మళ్లీ వినియోగించడం వంటి పర్యావరణ కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కృషి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం అల్యూమినియం ఎయిర్ బ్యా టరీల తయారీకి ఇజ్రాయిల్ కంపెనీ ఫినర్జీతో కలిసి ఐఓసీ ఫినర్జీ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ హిండాల్కోతో చేతులు కలిపింది. అల్యూమినియం ఎయిర్ బ్యాటరీలను తయారు చేయడానికి చెన్నైలో యూనిట్‌ను ఏర్పాటు చేశామని ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్టేట్ హెడ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) బి.అనిల్‌కుమార్ తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సం దర్భంగా మాట్లాడారు. ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నప్పటికీ.. కనీసం వచ్చే 20 ఏళ్ల వరకూ ద్రవ ఇంధనాల ఆధిపత్యమే కొనసాగుతుందని చెప్పారు.
10% ఇథనాల్ మిక్సింగ్..: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నామని చెప్పారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఐఓసీ ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకూ తెలంగాణలో 7 ప్లాంట్ల ఏర్పాటు కు ఎల్‌ఓఐలను జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణ పెట్రోల్ విక్రయాల్లో ఇండియన్ ఆయిల్‌కు అత్యధికంగా 34.6ు వాటా ఉంది. డీజిల్ విభాగంలో 38ు, డొమెస్టిక్ ఎల్‌పీజీలో 40 ు వాటా ఉందని అనిల్‌కుమార్ తెలిపారు.
మరో 264 ఛార్జింగ్ స్టేషన్లు: ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ సదుపాయాన్ని అందించేందుకు ఇప్పటికే తెలంగాణలో 94 బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వచ్చే మార్చి చివరి నాటికి మరో 264 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అనిల్‌కుమార్ చెప్పారు.
కొత్త బాట్లింగ్ యూనిట్‌పై రూ.167 కోట్లు..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు వద్ద కొత్త బాట్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దానిపై దాదాపు రూ.167 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. పారాదీప్, హైదరాబాద్‌ల మధ్య నిర్మిస్తున్న పైప్‌లైన్ 2023 చివరికి పూర్తయ్యే వీలుందని.. దీన్ని మొత్తం రూ.3,338 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నల్గొండ జిల్లా మల్కాపూర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెట్రోలియం టెర్మినల్ వద్ద ఈ పైపులైన్ ముగుస్తుంది. 1.8 లక్షల కేఎల్ సామర్థ్యంతో ఇక్కడ రూ.611 కోట్లతో స్టోరేజీ సదుపాయాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
హరిఓమ్ చేతికి తమిళనాడు కంపెనీ యూనిట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తమిళనాడులోని ఆర్‌పీ మెటల్ సెక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన గాల్వనైజ్డ్ పైప్ అండ్ కోల్డ్ రోల్ కాయిల్ యూనిట్‌ను కొనుగోలు చేయడానికి హరిఓమ్ పైప్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.55 కోట్లకు ఈ యూనిట్‌ను సొంతం చేసుకుంటున్నట్లు హరిఓమ్ పైప్స్ వెల్లడించింది.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి ఇండ్-భారత్ ఎనర్జీ (ఉత్కళ్)
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇండ్-భారత్ ఎనర్జీ (ఉత్కళ్).. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థగా మారింది. దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా 700 మెగా వాట్ల ఇండ్-భారత్ ఎనర్జీ (ఉత్కళ్)ను సొంతం చేసుకునే ప్రక్రియ పూర్తయిందని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వెల్లడించింది. రూ.1,047 కోట్లకు దీన్ని సొంతం చేసుకుంది. ఇండ్-భారత్ ఎనర్జీ (ఉత్కళ్)లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి 95 శాతం వాటా ఉంటుంది.