న్యూఢిల్లీ, మార్చి 9: ఆర్మీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా కల్నల్ గీతా రాణా నిలిచారు. ఎలకా్ట్రనిక్, మెకానికల్ ఇంజనీర్స్ విభాగానికి చెందిన ఆమె భారత్- చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లో ఇండిపెండెంట్ ఫీల్డ్ వర్క్‌షా్‌పకు నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ట్విటర్‌లో వెల్లడించారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన కమాండింగ్ బాధ్యతలను మహిళలకూ అప్పగించాలని ఇటీవల ఆర్మీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వివిధ విభాగాల్లో 108 స్ధానాల్లో మహిళా అధికారులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు ఆర్మీ చర్యలు చేపడుతోంది