రాజన్నసిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లిలో నెలకొన్న లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల సెస్ ఎ ఈ పృథ్విధర్ కు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ పిర్యాదు చేశారు. ఈయన పిర్యాదు మేరకు సెస్ లైన్ మెన్ జెట్టి తిరుపతి, లైన్ ఇన్స్పెక్టర్ కారం లక్ష్మీ రాజం, హెల్పర్ వెంకటేష్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సెస్ ఏ ఈ అదేశించారు. దీంతో ముగ్గురు క్షేత్ర స్థాయిలో పరిశీలించి విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజ్ విద్యుత్ సరఫరా జరుగుతున్నదని గమనించి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేలా చూడడం కోసం అంచనాలు తయారు చేస్తామని సెస్ అధికారులు తెలిపారు. కిష్టంపల్లి వద్ద గల సంప్ లోకి నీరు బయటకు వదలాలి అంటే ఇబ్బంది అవుతుందని సెస్ అధికారులకు తెలపగా విద్యుత్ సరఫరా జరుగుతున్న తీరును మిషన్ ద్వారా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ బోర్ మోటార్ ల ద్వారా నీటిని సరఫరా చేయడం కోసం కూడా తీవ్ర ఇబ్బంది అవుతుందనీ గ్రామ పంచాయతీ వాటర్ పంపు ఆపరేటర్ లు సతీశ్, రాజు లు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా కిష్టం పల్లి లో గల సంపు వద్ద, కిష్టంపల్లిలో గల గ్రామ పంచాయతీ బోర్ మోటార్ లకు కరెంట్ సప్లయి తీరును మిషన్ ద్వారా చెక్ చేశారు. ఇక్కడే గల పోచమ్మ గుడి వద్ద గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ అలంకారప్రాయంగా మారిందని దీనిపై ట్రాన్స్ఫార్మర్ బిగించడం వల్ల గ్రామ పంచాయతీ కి సంబంధించిన బోర్ మోటార్ లకు లో ఓల్టేజ్ విద్యుత్ సమస్య రాదని సెస్ అధికారులకు బాలరాజు యాదవ్ వివరించారు. సెస్ అధికారులు అంచనాలు తయారు చేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం అంచనాలు రూపొందించి సెస్ ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. బాలరాజు యాదవ్ వెంట సెస్ లైన్ మెన్ తిరుపతి, లైన్ ఇన్స్పెక్టర్ లక్ష్మి రాజం, హెల్పర్ వెంకటేష్, గ్రామ పంచాయతీ వాటర్ పంపు ఆపరేటర్ రోడ్డ సతీశ్, పిట్ల రాజు ఉన్నారు.