రెవెళ్ల D/86 కెనాల్ ని సందర్శించి పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతుల పంటపొలాలకు సరిపడా సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు. అనంతరం సుల్తానాబాద్ పట్టణంలో D/86 కెనాల్ కి సంబందించి ఉప కాలువలను సమీక్షించి గత పది సంవత్సరాలుగా ఉప కాలువలు పూడికతో నిండి ఉండడం వలన రైతులకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం సంబంధిత రైతులు నా దృష్టికి తీసుకురాగా ఎక్స్ వేటర్లో సహాయంతో కాలువలో పది సంవత్సరాలుగా పేరుకపోయిన షీల్డ్ ను, చెత్తా చెదారాన్ని తొలగించడం జరిగింది. కాలువలో ఉన్న పూడిక తీసి ఉపకాలువల మరమ్మతులు చేపట్టి నియోజకవర్గంలోని క్రింది ప్రాంత రైతులకు కాలువల ద్వారా నీరు అందిస్తామన్న పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.