కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా విచ్చలవిడిగా మధ్యం విక్రయాలు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయని మందుబాబుల నిరుపేద కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వాంకిడి మండలంతో పాటుగా ఇతరత్రా మద్యం అమ్మకాలు కొనుగోళ్లు ఇష్టానుసారంగా ధరల దోపిడీ జిల్లాలోని అన్ని మండలాల్లో జోరుగా సాగుతోందని విశ్వసనీయ సమాచారం. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని బెజ్జుర్ మండల కేంద్రంలో గల శ్రీనిధి వైన్స్ -1 మధ్యంషాప్ నిర్వాహకులు నేరుగా మద్యం షాపుకు వచ్చిన అమాయక కొనగోలు దారుల దగ్గర నుండి ఒక్క క్వాటర్ పై రూ20.నుండి 30వరకు అదనంగా వసూలు చేస్తూ నిలుపు దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతూ మూడు పువ్వులు, ఆరు కాయలుగా అధిక లాభాలు గడిస్తున్నారు. మద్యం ప్రియులు సైతం చేసేది లెక మధ్యం కొనగోలు చేసుకుంటున్నామంటున్నారు. మద్యం షాపు నిర్వాహకులు దగ్గర్లో ఉన్న మహారాష్ట్ర సరిహద్దులకి సరఫరా చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అంతే కాకుండా గ్రామ, గ్రామాన ముందుకు కోదువా లేకుండా బెల్ట్ షాపులను ప్రోత్సాహిస్తూ బెల్ట్ షాపుల యజమానులకు క్వాటర్ పై 20రూపాయలు అదనంగా తీసుకుంటూ కొనుగోలుదారుల నుండి మీ ఇష్టంవచ్చినట్లు తీసుకోండి అనండంతో గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపుల నిర్వాహకులు ఒక్క క్వార్టర్ పై 40రూపాయలు నుండి 50రూపాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణం బందు ఉన్న రోజు కూడా నిర్వాహకులు బెల్ట్ షాపులకు ముందుగానే మధ్యాన్ని సరఫరా చేసి లాభాలను అర్జిస్తున్నారు. మద్యం టైంకు దొరకదు అన్న మాటే లేదు. 24గంటలు అందుబాటులో ఉండే విదంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అమ్మకాలు చేపడుతున్నారు. అంతే కాకుండా అధికారుల అండదండలతో వ్యాపారులు రెచ్చిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార యత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తక్షణమే అధిక ధరలకు అమ్మకాలను సాగిస్తున్న మద్యం షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.