తెలంగాణ రాష్ట్రంలో లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్ 04వ తేదీ మంగళవారం నాడు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలగకుండా, సజావుగా సాగేలా తీసుకునేటువంటి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ ఆఫ్ సి.ఆర్.పి.సి. అమలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి, ఐపీఎస్. ఆదివారంనాడు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తేదీ:04-06-2024 మంగళ వారం రోజు ఉదయం 06 గంటల నుండి తేది:05–06-2024 బుధవారంనాడు ఉదయం 06గంటల వరకు, ఒకవేళ రీ-కౌంటిగ్ జరిగితే అవికూడా ముగిసేవరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు. ఏదైనా చట్టపరిధిలోని కారణంచేత సమావేశ పడవలసిన అవసరం ఏర్పడితే సంబంధిత అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. పై ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్. అభిషేక్ మహంతి విలేకరుల సమావేశంలో తెలిపారు..