Wednesday, January 14, 2026
spot_img
HomeTELANGANAఅజాగ్రత్తగా ఆటో నడిపిన వ్యక్తిపై కేసు నమోదు

అజాగ్రత్తగా ఆటో నడిపిన వ్యక్తిపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హెచ్పి పెట్రోల్ పంప్ సమీపంలో ఓ వ్యక్తి అజాగ్రత్తగా ఆటో నడిపి ఆటోను బోల్తా కొట్టించిన సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు అయినందున బాధితుని ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సూరోజు వెంకట్రాజ్యం వ్యక్తిగత పనులకై గొల్లపెల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేటకు వచ్చేందుకు ఓ గుర్తు తెలియని ఆటోలో ఎక్కాడు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ హెచ్ పి పెట్రోల్ పంపు వద్ద పల్టీలు కొట్టించాడు. ఈ ప్రమాదంలో వెంకట్రాజం ఆటో నుంచి కింద పడగా తలకు కాళ్లకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అజాగ్రత్తగా, అతివేగంగా నడిపిన ఆటో డ్రైవర్ పై బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments