రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డి పెట్ తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గత ఇరవై సంత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవలు 1066 మంది యువతుల వివాహాలకు పుస్తే మట్టెలు కరువు కాలంలో ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరా నిరుపేదలకు ఆశ్రయం బియ్యం పంపిణీ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పండుగలను ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అన్ని మతాల ప్రజలను వారి వారి పవిత్ర స్థలాలైన యాదగిరి గుట్ట మెదక్ పెద్ద గుట్ట తీసుకెళ్లడం ఇలాంటి ఎన్నో సేవలు చేశారు. గతంలో భారత్ అమ్మొల్ అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ ఉత్తమ సామాజిక కార్యకర్త గా గుర్తించి గౌరవించిన విషయం విదితమే. ఈ సామాజిక సేవలను గుర్తించిన అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ వారు ఈ రోజు హైదరాబద్ లోని దక్కన్ తాజ్ ప్యాలెస్ లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు