రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంటకు చెందిన ఇట్ల మహేష్ తన వ్యక్తి గత 15 సంవత్సరాల నుండి సౌదీ అరేబియా కు చెందిన కూలీగా పనిచేస్తున్నాడు. నాలుగో తేదీ జూలై రోజున రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్ట్ ఎటాక్ తో మరణించగా ఈ విషయం యూఏఈ సామాజిక కార్యకర్త అయిన జనగామ శ్రీనివాస్ కు తెలిసిన వెంటనే తెలంగాణ ఎన్నారై డిపార్ట్మెంట్ చిట్టిబాబు సహాయంతో హైదరాబాదు నుండి వెంకయ్య కుంట వరకు ఫ్రీ అంబులెన్స్ ను ఏర్పాటు చేయించారు. మృతుడు పిట్ల మహేష్ కు తల్లి మల్లవ్వ, భార్య కావ్య, కూతురు నేహా, కొడుకు నవనీత్ ఉన్నారు. కుటుంబ పెద్ద మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు చిన్న వారు కావడంతో తండ్రి చనిపోయాడన్న విషయాన్ని దిగమింగుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. మృతుని ఇంటి వద్ద ఆ దృశ్యాన్ని చూసిన వారి మనసు కలిచి వేసింది. ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ బాట పట్టి కూలిగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎంతోమంది రాజన్న సిరిసిల్ల నుండి ఉన్నారని ప్రభుత్వం బాధిత కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని యూఏఈ సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ కోరారు.