Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఅమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ ఔదార్యం

అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ ఔదార్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చీర్ల లక్ష్మి తీవ్ర అనారోగ్యంతో బాద పడుతున్నపరిస్థితి తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ BRS మండల ఉపాధ్యక్షుడు ఆకుల మురళీమోహన్ గౌడ్ 50 కిలోల బియ్యం వితరణ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. భార్య లక్ష్మిఅనారోగ్యం, భర్త వెంకటేశం ఏ పని చేయలేనీ స్థితిలో వుండటంతో ఆ కుటుంబం దీన స్థితికి పలువురు పూసల కులసంఘ నాయకులు కూడా చలించిపోయి వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ గౌడ్ తో పాటుపూసల సంఘ నాయకులు గౌరవ అధ్యక్షుడు మద్దివేని లక్ష్మణ్, అధ్యక్షుడు మద్దివేణి కృష్ణ, కోశాధికారి మద్దివేణి శ్రీధర్, ఉపాధ్యక్షులు కోనేటి సతీష్, సోషల్ మీడియా కన్వీనర్ ముద్రకోలా కృష్ణ, ప్రధాన కార్యదర్శి మద్దివేణి దేవందర్, ఉపాధ్యక్షులు మద్దివేణి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి మద్దివేణి శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు శీర్ల లక్ష్మన్, నరేష్, నవీన్ పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments