రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం కారణంగా ఒక కుటుంబం వరంగల్ ఎంజీఎం లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వీణవంక మండలంలోని ఒక పెళ్లికి హాజరు కావడానికి ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు కుమారుడుతో వెళుతుండగా ఆదివారం సుమారు రాత్రి 8:30 సమయంలో జగ్గయ్యపల్లి నుండి వల్బాపూర్ మధ్యలో రైతులు ఆరబోసిన ధాన్యం కారణంగా ద్విచక్ర వాహనదారుని బైకు అదుపుతప్పి భార్య కుమారుడుతో సహా కింద పడగా తీవ్ర గాయాల పాలైన దంపతులు కుమారుడు. పరిస్థితి విషమించడంతో సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న జమ్మికుంట 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీరికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


