కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి)మండల కేంద్రంలో ఈనెల మార్చి 3 నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోనవెల్లీ PHC డాక్టర్ నవత అన్నారు. సిర్పూర్ టి మండలంలో వచ్చే నెల 3నుంచి 5 వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాలలో పల్స్ పోలియోకు కార్యక్రమనికి కేటాయించిన సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మండలంలోని అన్ని గ్రామాలలోని 0నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియోచుక్కలు వేయాలన్నారు. లోనవెల్లీ పీహెచ్సీ సిర్పూర్(టీ)మండలం లోనవెళ్లి పిహెచ్సి పరిధిలో 8775 ఇండ్లు ఉన్నాయని 3170 మంది 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారని అందుకోసం 25 బుత్ లను ఏర్పాటు చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీహెచ్సీ డాక్టర్ నవతఅన్నారు.