Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAరాహుల్ గాంధీని మర బొమ్మ అన్న ఎంఐఎం పై మహమ్మద్ తాజుద్దీన్ ఆగ్రహం

రాహుల్ గాంధీని మర బొమ్మ అన్న ఎంఐఎం పై మహమ్మద్ తాజుద్దీన్ ఆగ్రహం

కరీంనగర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ బి ఆర్ ఎస్, బిజెపి, ఎంఐఎం తోడు దొంగలని మాట్లాడడం జరిగిందని, ఇది నిజం కాదా, దీనికి ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం హుస్సేన్ రాహుల్ గాంధీని మర బొమ్మతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాబ్రీ మసీదును కూల్చివేసిన శివసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని మాట్లాడుతున్నారు. బాబ్రీ మసీద్ విషయంలో బిజెపి శివసేన ఒకటే అని గుర్తుంచుకోవాలి, బిజెపి పార్టీ దేశద్రోహ పార్టీ అని శివసేన గుర్తించి ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుంది, కానీ ఎంఐఎం బిజెపితో లోపాయికార ఒప్పందం పెట్టుకుంది. బాబ్రీ మసీదును కూల్చిన పార్టీ కాంగ్రెస్ అంటున్నారు, అలాంటిది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది నిజం కాదా ,4% రిజర్వేషన్ పొందింది నిజం కాదా, టిఆర్ఎస్ ప్రభుత్వం 12% రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఓట్లు దండుకొని 10 సంవత్సరాలైనా ఇప్పటివరకు ఊసే లేదు, దీని గురించి బిఆర్ఎస్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు? బిజెపి పార్టీ దేశంలో మతకలహాలు సృష్టిస్తున్న పార్టీ, గుజరాత్ లో కూడా మతకలహాలు సృష్టించి ఎంతోమంది ముస్లింలను ఊచకోత కోచిన పార్టీ బిజెపి పార్టీ, అలాంటి పార్టీతో లోపాయికార ఒప్పందం చేసుకుని దేశంలో సృష్టిస్తున్నారు మీరు, బిఆర్ఎస్ డెవలప్ చేసింది అంటున్నారు 9 సంవత్సరాల కాలంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపెట్టాలి. ఓవైసీ తన సొంత లాభం కోసం బి ఆర్ ఎస్, బిజెపి వాళ్ళ ముందు మోకారిల్లి ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని, బిజెపి, బీఆర్ఎస్ వాళ్ల అడుగులకు మడుగులోత్తుతారు తప్ప ముస్లింల అభివృద్ధి గురించి ప్రశ్నించరు, సెక్రటేరియట్లో ఉన్న మసీదులను కూల్చి మల్లి కడితే కెసిఆర్ మీకు దేవుడైనాడా? దేశంలో ఎంఐఎం పార్టీని నమ్మేస్థితిలో ముస్లింలు లేరని, ఎంఐఎం పార్టీ గోడమీద పిల్లి లాంటిది అధికారం ఏ వైపు ఉంటే అటువంటి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఏడు సీట్లను కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి అని సవాల్ చేస్తున్నాం అన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్. విలేకరుల సమావేశంలో సయ్యద్ అఖిల్ నిహాల్ అహ్మద్ లాయిక్ షహేన్షా అష్రఫ్ కరీం ఫిరోజ్తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments