రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాజీనామా సమర్పించారు, ఈ రాజీనామా పత్రాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు సోమవారం పంపినట్లు నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో గత పది సంవత్సరాలుగా ఆకింత భావంతో పని చేస్తున్నామన్నారు, సిరిసిల్ల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విశ్వాసంతో నమ్మకంతో ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ అబివృద్ధి కోసం పని చేశామన్నారు. తాను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అందరికీ సుపరిచితున్ని అయిన నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదన్నారు, వ్యక్తిగతంగా చిల్లిగవ్వ పని కూడా కెటిఆర్ తమకు చేయలేదని దీంతో బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు, తన శ్రేయాబిలాషులతో భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజాసేవ చేయడం కోసం ఏ పార్టీలో చేరాలనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు