రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆకారపు కమలేష్ అను వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి నిన్న ఉదయం 9:30 గంటలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ తో కలిసి తోటి సిబ్బందితో పోలీస్ స్టేషన్ ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గోనెల రాజు తన ప్యాసింజర్ ఆటో నెంబర్ ఏపీ 15 ఈసీ 1169 లో పరిమితికి మించి ప్రమాదం జరిగితే వారి ప్రాణాలకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా 16 మంది ప్యాసింజర్లను ఎక్కించుకొని వచ్చినాడు అని ఫిర్యాదు చేయగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకొని నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు.