ప్రతిమ ఫౌండేషన్ లో ఉచిత శిక్షణ కోసం ఆదర్శ ఇనిస్టిట్యూట్ లో అవగాహన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆదర్శ టైప్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో సోమవారం ప్రతిమ ఫౌండేషన్ ప్రోగ్రాం అధికారిని గీతారెడ్డి ఆదేశాల మేరకు గంభీరావుపేట కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి నిరుద్యోగులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ పందిర్ల నాగరాణి విద్యార్థులకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేద యువత కోసం ప్రతిమ ఫౌండేషన్ ఉచితంగా శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతిమ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ కోనరావుపేట మండలంలోని నాగారంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం మహిళలకు హోమ్ హెల్త్, టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, యోగ, క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా మగవారికి ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్, రిటైల్ సేల్స్ అసోసియేట్, సోలార్ పివి ఇన్స్టాలర్, ఏసీ టెక్నీషియన్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో గల ఆదర్శ టైప్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మజీద్ సెల్ 9441377068, 7013882822, 9676826473 లను సంప్రదించాలని కోరారు.