భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఎం పార్టీ అద్యార్యంలో తిర్యని మండలంలోని ఉల్లిపిట్ట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం ఆసిఫాబాద్ నియోజకవర్గ కన్వీనర్ దుర్గం.దినకర్ మాట్లాడుతూ, పేద ప్రజలకోసం, పేద ప్రజలపక్షాన, కార్మికుల, వ్యవసాయ కార్మికుల, కూలీల పక్షాన ఎర్రజెండా నిలుస్తుందని అన్నారు. ఈ మండలంలో భూపోరాటాలు చేసి దాదాపు 1200 ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర సీపీఎం దని యూపీఏ -1 ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కులచట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కుచట్టం లాంటి ముఖ్యమైన చట్టాలు పోరాడి సాధించామని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా బీజేపీ ఆకలి నుండి ఆనందం వరకు ఆంక్షలు విదిస్తుందని ఆవు మాంసం తింటున్నారని అక్లక్ ను చంపారని, చరిత్రను వక్రీకరిస్తున్నారనీ, ప్రశ్నించే వాళ్ళను జైల్లో పెడుతున్నారని చివరకు ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రులను సైతం జైల్లో పెట్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని అన్నారు.
రామ మందిరాన్ని చూపెట్టి ఓట్లు అడగడం ఎలా కరెక్టో ఆలోచించాలని పిలుపునిచ్చారు. మోడీ హయాంలో ఒక్క కొత్త ఆసుపత్రి ఏమైనా కట్టారా అని ప్రశ్నించారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇండియన్ రైల్వేస్, దేశ నవరత్న కంపెనీలను అమ్ముతున్నారని, ఎల్ఐసి నీ సైతం ప్రైవేట్ పరం చేస్తుందని దుయ్యబట్టారు. బిజేపీ నరేంద్రమోడీ ని చూసి ఓటు వెయ్యమని అడుగుతుందని,కానీ అభివృద్ధిని చూసి ఓటు వెయ్యాలని పిలుపు నిచ్చారు. ఎర్రజెండా అధికారంలో ఉన్న కేరళలో అభివృద్ధి చేశామని, విద్యా అభివృద్ధి జరిగిందని అన్నారు. మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బిజేపీ నీ ఓడించాలని ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్రం సుగుణ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గేడం. తికనంద్.పురుషోత్తం. సతిష్.నిఖిల్.తిరుపతి. మలశ్రి.శ్రావణి శ్రీకాంత్ శివ తదితరులు పాల్గొన్నారు..