కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో రైతు కంపరపు నాగేశ్వరరావు పొలంలో పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిణి జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏవో జోకా అమృత మాట్లాడుతూ ప్రస్తుతం రైతులందరూ దమ్ములు చేసి నాట్లు వేస్తున్నారు కాబట్టి డిఏపి ఎరువును దమ్ము చేసే సమయంలోనే వాడాలని అదేవిధంగా పొటాష్ కూడా వేసుకోవాలని, నారుమడిలో నారు చివర్లను తుంచి మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలని తెలియజేశారు. కౌలు రైతులు జెఎల్ జి గ్రూపులుగా ఏర్పడినట్లయితే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని తెలియజేశారు. బెంగాలీ ఊడుపు ఊడ్చే రైతులు అందరూ కూడా నారుమడి వేసిన 21 రోజుల లోపు నాట్లు పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లంగి గ్రామ వ్యవసాయ సహాయకులు ఆకుల సురేష్, రాజాల అబ్బాయి, రైతులు కాళ్ళ భద్రాచలం, కంపరపు నాగేశ్వరరావు, నైదాన రఘు, కర్రి వీరబాబు, చిన్నారావు, శరకణం బాబ్జి తదితర రైతులు పాల్గొన్నారు.
దమ్ము చేసే సమయంలో డిఏపి, పొటాష్ ఎరువులను వేసుకోవాలి: A.O. జోకా అమృత
RELATED ARTICLES