Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకొడంగల్ యువకుడికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం తో అమెజాన్ లో ఉద్యోగం

కొడంగల్ యువకుడికి రూ. 2 కోట్ల వార్షిక వేతనం తో అమెజాన్ లో ఉద్యోగం

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన సయ్యద్ అర్బాజ్ ఖురేషి(26) ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్ లో రూ. 2 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో, అమెరికాలో అప్లైడ్ సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించాడు. నేడు (9-12-2024) అతను ఈ ఉద్యోగంలో చేరనున్నాడు. అర్బాజ్ ఖురేషి తాత అయిన డాక్టర్ జలాలుద్దీన్ ఖురేసి 1980-90ల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించాడు. గాంధేయవాదిగా, మానవతావాదిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాడు. ఈయన 1984లో కొడంగల్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా,1989లో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఈయన ముగ్గురు కుమారులు చదువుల కొరకు హైదరాబాద్ వెళ్లి పెద్ద కుమారుడు, ఉద్యోగం సాధించగా, రెండవ కుమారుడు యూఎస్ లో డాక్టర్ గా స్థిరపడ్డాడు. మూడవ కుమారుడు హైదరాబాదులో బిజినెస్ చేస్తున్నాడు. అర్బాజ్ ఖురేషి చదువు హైదరాబాద్, గుంటూరు,తదితర ప్రాంతాల్లో కొనసాగింది. 2019లో ఐఐటీ పాట్నా నుంచి కంప్యూటర్ సైన్సులో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

మూడవ సంవత్సరంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మెషీన్ లెర్నింగ్ కోవిదుడు గేల్ డయాస్ వద్ద మూడు నెలల ఇంటర్న్షిప్ చేశాడు. అనంతరం బెంగళూర్ లోని “మైక్రోసాఫ్ట్ రీసర్చ్” లో రెండు సంవత్సరాలు పనిచేసి, యూఎస్ఏ లోని యూఎమ్ఎఎస్ఎస్ (యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్) నుంచి 2023 లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,మెషీన్ లెర్నింగ్ లో ఎంఎస్ పట్టా పొందాడు. ఎంఎస్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రముఖ ఐటీ సంస్థ అయిన గూగుల్ లో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం దక్కింది. స్థానిక మూలాలు కలిగిన ఈ యువకుడి విజయం వెనకబడ్డ కొడంగల్ ప్రాంత యువతకు స్ఫూర్తి నివ్వాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. అర్బాజ్ ఖురేషి తండ్రి యాసిన్ ఖురేషి ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ గా కొనసాగుతున్నాడు. అమెజాన్ లో శాస్త్రవేత్త ఉద్యోగం పొందడం పట్ల తుంకిమెట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments