జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కొనుగోలు చేసిన లే అవుట్‌పై మాట్లాడటానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఎక్కడో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులు గాయపరచవద్దన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారానికో పది రోజులకో వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపించాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. మీరు ఎంత తాపత్రాయ పడినప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కదలించలేరన్నారు.
పవన్‌పై మండిపడ్డ జోగి రమేష్
RELATED ARTICLES