రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో బిజెపి నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డిలు పలు గ్రామాల్లో తిరిగి సభ్యత్వ నమోదు చేయించారు. కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి ,సల్లసత్యం రెడ్డి, మానుక బాబు, మేడిశెట్టి బాలయ్య, అంబాటి వినోద్, కార్తీక్ రెడ్డి, రవి తదితరులు బూత్ అధ్యక్షులతో కలిసి రాగట్లపల్లి, హరిదాసు నగర్, పదిర, వెంకటాపూర్, అగ్రహారం, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి సభ్యత్వ నమోదు పత్రాలు నూతన సభ్యులకు అందచేశారు. బిజెపి సభ్యత్వ నమోదు చేసే విధానాన్ని ఆయా గ్రామాలకార్యకర్తలకు వివరించి సభ్యత నమోదు చేయాలని కోరారు.