కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన తరలించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. రుద్రంగి మండలంలోని మానాల, సమీపంలోని తండాల వద్ద ఉన్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ శుక్రవారం తడిసిన ధాన్యాన్ని, రీజిస్టర్లు పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని జాగ్రత్తగా తడవకుండా కింద, పైన టార్పలిన్ కప్పాలని నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అలాగే రుద్రంగి మండలకేంద్రంలోని రైస్ మిల్లు, వేములవాడ మండలం మర్రిపల్లి మిల్లులో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్లు, అధికారులు, కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.