Wednesday, January 22, 2025
spot_img
HomeTELANGANAమనువాదానికి వ్యతిరేకంగా స్త్రీలకు విద్యను అందించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలే.

మనువాదానికి వ్యతిరేకంగా స్త్రీలకు విద్యను అందించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలే.

భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా మక్దుం నగర్ సీపీఐ కార్యాలయంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని మాట్లాడుతూ నాడు జ్యోతిబాపులే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి ఆ విద్యను అందరికి అందించాలనే ఆశయంతో మనువాదనికి వ్యతిరేకంగా స్త్రీల విద్యను ప్రోత్సహిస్తున్న సందర్భంలో అక్కడి బ్రాహ్మణ మనువాదులు ఆమె పై అనేక రకాలుగా దాడి చేసినప్పటికీ భయపడకుండా దైర్యంగా నిలబడి పోరాడి స్త్రీలకు విద్యను బోధించిన చరిత్ర అని కొనియాడారు. సావిత్రి బాయ్ పూలే నాడు చదువును చెప్పకపోతే, ఇప్పటికి మహిళలు చదువుకు దూరమే అయ్యేవారేమోనని కావున అలాంటి వారి కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
మహిళా సమాఖ్య కార్యదర్శి హైమావతి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చి భేటి బచావో భేటి పడావో అంటూ నినాదాలు చేస్తున్నారు కానీ నేడు ప్రపంచ వ్యాప్తంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన రెజ్లర్లు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తొలగించండి అంటే మాట్లాడటం లేదని, మణిపూర్లో మహిళల పై జరిగిన అత్యాచారాలు, ఇలాంటి అనేక ఆరోపణలు వస్తే మాట్లాడటం లేదని ఆరోపించారు. మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ల పై గత పది సంవత్సరాల నుండి మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అది కూడా ఇంకా పది సంవత్సరాలకు చట్టం వస్తుందని చెప్పడం కేవలం ఎన్నికల స్టంట్ అని కావున రానున్న ఎన్నికల్లో మహిళా వ్యతిరేకి అయ్యిన బీజేపీ ని ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు సత్యవతి, గోవిందమ్మ, చంద్రమ్మ, అనసూయ, మహేశ్వరి,భాగ్యమ్మ, చంద్రకళ, సరిత, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments