ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా ఎల్లారెడ్డి పేటలో గల ఇందిరమ్మ కాలనీ వాసులు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకు మాత్రమే ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం, గృహ జ్యోతి లాంటి పథకాలను అమలు చేస్తూ మహిళకు బరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తాము ఉంటున్న ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయినవేనని ఆయన అన్నారు. ఇప్పటికీ నివాసముంటున్న ఇండ్లకు ఇంటి పట్టాలు పంపిణీ జరగలేదని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇండ్లకు ఎవరికి కూడా పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదని పై సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవల ఎల్లారెడ్డి పేటలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమం కు హాజరైన వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సమస్యను తాజా మాజీ సర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు వివరించినట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకూ ఇందిరమ్మ కాలనీ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఇందిరమ్మ కాలనీ మహిళలు పాల్గొన్నారు