రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో, మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు 11:00 వరకు కూడా విధులకు హాజరు కాకపోవడంతో కొన్ని ఖాళీ సీట్లు దర్శనమిచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలన్ని ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మండల పరిషత్ కార్యాలయంలో 11:00 దాటిన అధికారుల కుర్చీలు కొన్ని ఖాళీగానే దర్శనమిచ్చాయి. మండల ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన పలు గ్రామాల ప్రజలు చేసేదేమీ లేక ఎప్పుడు వస్తారో అంటూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అధికారులు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా హాజరు కాకపోవడం ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో యథా రాజా తథా ప్రజా అనే విధంగా తయారయింది. దీంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. మండల గ్రామాలలో ప్రజలు సమస్యలు చెప్పుకుందామని మండల కార్యాలయాలకు వస్తే అధికారులకు కుర్చీలన్నీ కొన్ని శాఖలలో ఖాళీగానే దర్శనం ఇస్తాయి. ఇప్పటికైనా ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మండల పరిషత్ అధికారి ఇన్చార్జ్ పక్క మండలమైన గంభీరావుపేట ఎంపీడీవో కి ఇవ్వగా, ఎంపీఓ వేరే మండలానికి బదిలీ అయ్యారు. కార్యాలయ పరిస్థితి ఇలా ఉండగా పనుల మీద వచ్చిన సామాన్య జనాలకు ఖాళీ కుర్చీలు కనిపించడంతో అసహనానికి గురవుతున్నారు.