మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మారేడ్ పల్లి ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ
మమత హాస్పటల్, పార్ధా డెంటల్, లయన్స్ ఐ హాస్పటల్, బిగ్ టివి వారి సౌజన్యంతో బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్ధిక స్తోమత లేక హాస్పిటల్స్ కు వెళ్ళలేని వారు ఉపయోగించుకుని, ఉచితంగా పరీక్షలు చేయించుకుని, మందులు కూడా ఉచితంగా అందుకోవాలని అన్నారు.
కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నారని, కావున ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న బద్రీనాథ్ యాదవ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తాను కూడా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నానని, మంచి మనసుతో అందరూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


