నందిగామ మండలంలోని లింగాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని “లచ్చపాలెం* గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రజలకు అందజేశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగన్నరేళ్లలో నందిగామ నియోజకవర్గ చరిత్రలో కనీ విని ఎదగని అభివృద్ధి జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలుపు సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన, చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడానికే ప్రతి గడపకు వెళ్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కేవలం దుష్ప్రచారాలు మాత్రమే నమ్ముకుందని, గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని కొనియాడారు. ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వాన్ని సీఎం జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ప్రతి ఇంటిలో జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారని.. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో వారంతా సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..