ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నుంచే ఆప్రకటిత విద్యుత్ కోత అంటున్న వినియోగదారులు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆప్రకటిత కరెంటు కోత వల్ల విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో గురువారము రెండు మూడు సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నుంచే విద్యుత్ సిబ్బంది అప్రకటిత కరెంటు కోత విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట సెస్ సిబ్బంది ఆప్రకటిత కరెంటు కోత విధించడంపై వెంటనే ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాసు సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లు సెస్ అధికారులతో మాట్లాడి ఈ అప్రకటిత కరెంటు కోతను ఎత్తేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు,


