అంకారా/డమాస్కస్: తుర్కియే, సిరియాలో సంభవించిన పెను భూకంపాల మృతుల సంఖ్య 50వేలు దాటవచ్చని ఐక్యరాజ్య సమితి సహా య కార్యక్రమాల విభాగాధిపతి మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు. ఈ ప్రాంతంలో వందేళ్లలో ఇదే పెను విలయమన్నారు. తుర్కియేకు చేరిన ఆయన భూకంప ధాటికి కకావికలమైన పలు ప్రాంతాలను సందర్శించారు. ఆదివారంనాటికి భూకంప మృతుల సంఖ్య 33 వేలు దాటింది. సిరియా ప్రభుత్వం శుక్రవారం నుంచి మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించడం ఆపేసింది. సిరియాలో 50 లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని సమితి శరణార్థుల విభాగం హైకమిషనర్ శివంక ధనపాల తెలిపారు. కాగా, తుర్కియేలోని భూకంప ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు ఉచితంగా తీసుకెళ్లేందుకు టర్కిష్, పెగాసస్ ఎయిర్‌లైన్స్ ముందుకువచ్చాయి.
భూకంప మృతుల సంఖ్య 50 వేలు దాటిపోతుంది
RELATED ARTICLES